Thursday, April 5, 2012
ఇంగ్లిష్ టీచర్లకు ఉచిత ఆన్‌లైన్ కోర్సు
లండన్: ఆంగ్లాన్ని బోధించే ఉపాధ్యాయులకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ భాషపై పట్టు, మెరుగైన బోధనా పద్ధతులపై టీచర్లలో మరింత అవగాహన పెంపొందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు ప్రత్యేక కోర్సుకు డిజైన్ చేశారు. ‘కేంబ్రిడ్జి ఇంగ్లిష్ టీచర్’ అని వ్యవహరించే ఈ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఆంగ్ల టీచరైనా సభ్యుడు కావచ్చు. ఏడాదికి కేవలం నామమాత్రపు ఫీజుతో ఇందులో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కేంబ్రిడ్జి ఈఎస్‌ఓఎల్ ఎగ్జామినేషన్స్, అక్కడి యూనివర్సిటీ ప్రెస్ సంయుక్తంగా ఈ కోర్సును అందిస్తున్నాయి. ‘గ్రామర్ ఫర్ టీచర్స్: లాంగ్వేజ్ అవేర్‌నెస్’ పేరుతో ఇంగ్లిష్‌లో నిపుణులైన అధ్యాపకులు.. తమ అభిప్రాయాల్ని, బోధనలో మెలకువల్ని అందజేస్తారు. ఇంగ్లిష్ గ్రామర్‌ను మరింత విశ్వాసంతో బోధించేలా చేయడం, టీచర్లను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని కేంబ్రిడ్జి ఈఎస్‌ఓఎల్ రిలేషన్స్ మేనేజర్ అండ్రూ నీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో వస్తున్న మార్పులు, ఒకరితో మరొకరు తమ అభిప్రాయాలను పంచుకోవడం, తరగతి గదుల్లో మరింత విశ్వాసంతో బోధించేలా చేయడం తమ ఉద్దేశమని వివరించారు. మార్చిలో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ కోర్సులో ఇప్పటికే 2000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment