Saturday, April 14, 2012
Thursday, April 5, 2012
ఇంగ్లిష్ టీచర్లకు ఉచిత ఆన్లైన్ కోర్సు
లండన్: ఆంగ్లాన్ని బోధించే ఉపాధ్యాయులకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ భాషపై పట్టు, మెరుగైన బోధనా పద్ధతులపై టీచర్లలో మరింత అవగాహన పెంపొందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు ప్రత్యేక కోర్సుకు డిజైన్ చేశారు. ‘కేంబ్రిడ్జి ఇంగ్లిష్ టీచర్’ అని వ్యవహరించే ఈ ఫ్రీ ఆన్లైన్ కోర్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఆంగ్ల టీచరైనా సభ్యుడు కావచ్చు. ఏడాదికి కేవలం నామమాత్రపు ఫీజుతో ఇందులో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కేంబ్రిడ్జి ఈఎస్ఓఎల్ ఎగ్జామినేషన్స్, అక్కడి యూనివర్సిటీ ప్రెస్ సంయుక్తంగా ఈ కోర్సును అందిస్తున్నాయి. ‘గ్రామర్ ఫర్ టీచర్స్: లాంగ్వేజ్ అవేర్నెస్’ పేరుతో ఇంగ్లిష్‌లో నిపుణులైన అధ్యాపకులు.. తమ అభిప్రాయాల్ని, బోధనలో మెలకువల్ని అందజేస్తారు. ఇంగ్లిష్ గ్రామర్‌ను మరింత విశ్వాసంతో బోధించేలా చేయడం, టీచర్లను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని కేంబ్రిడ్జి ఈఎస్ఓఎల్ రిలేషన్స్ మేనేజర్ అండ్రూ నీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో వస్తున్న మార్పులు, ఒకరితో మరొకరు తమ అభిప్రాయాలను పంచుకోవడం, తరగతి గదుల్లో మరింత విశ్వాసంతో బోధించేలా చేయడం తమ ఉద్దేశమని వివరించారు. మార్చిలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ కోర్సులో ఇప్పటికే 2000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఉచితంగా ఆరోగ్యం
రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
‘ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేం’ అన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ ఫ్రీగా లభించేవే. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగానే ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ కథనం.
మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే 10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను (మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...
వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.
జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
{పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.
వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.
వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.
జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.
నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.
పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.
స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.
మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.
ఉదాహరణకు
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.
దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.
అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.
దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.
దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.
నిద్ర బాగా పట్టాలంటే...
బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.
ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.
నిద్రకు వుుందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.
రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.
నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.
పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.
నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
నిద్ర...
ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
Subscribe to:
Posts (Atom)