Sunday, January 31, 2010

buddha

జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో[1][2] రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాష లో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది. ఈ కథలన్నింటిలోనూ, సాధారణ మానవుడు పాటించవలసిన ధర్మాలు, నీతి నిజాయితీలు , త్యాగం మొదలైన లక్షణాలతో పాటు చక్కటి సందేశం కూడా అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. బుద్ధుడు తన పూర్వజన్మల్లో వివిధ జాతులకు చెందిన మానవుడిగా, జంతువుగా జన్మిస్తాడు. చాలా కథలు ఇప్పుడు వారణాసి లేదా కాశీ గా పిలువబడుతున్న బెనారస్ చుట్టూ అల్లబడ్డాయి. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ నగరానికి దగ్గర్లో ముస్లిములకు, బౌద్ధులకు కూడా పవిత్రమైన ప్రదేశాలున్నాయి. బౌద్ధుల సాంప్రదాయం ప్రకారం గౌతముడు మొట్టమొదటిసారిగా ఈ నగరానికి కొద్ది దూరంలో ఉన్న సారనాథ్ అనే ప్రదేశం నుంచి ప్రారంభించాడని ప్రతీతి. చందమామ పత్రికలో ఈ జాతక కథలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.
[మార్చు]మూలాలు

↑ http://02ce47d.netsolhost.com/jataka.html
↑ http://www.pitt.edu/~dash/jataka.html#about

No comments: